హెల్త్ & ఫిట్నెస్

మన బాడీలోపలఏయే టైం లోఏం జరుగుతుందో తెలిస్తే ; ఖచ్చితంగాఆశ్చర్యపోతారుమనం ఏ పని చేసినా దానికిఒక టైం అంటూ ఉంటుంది. కానీమన శరీరం కూడాఒక నిర్దిష్టమైన సమయాన్ని పాటిస్తుందని మీకు తెలుసా? అవును; మీరు విన్నది నిజమే. మన శరీరం కూడాతనలో జరిగే జీవ- క్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో ఆయాఅవయవాలుయాక్టివ్గా పనిచేస్తాయి. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్ గాఉన్న సమయంలో వాటికివిరుద్ధంగా మనం చేసే కొన్ని పనుల వల్ల ఆయాభాగాలపైఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం కలగుతుంది. ఈ క్రమంలో అసలు ఏయే భాగాలుఏయే సమయాల్లో యాక్టివ్గా పనిచేస్తాయో; అవి పని చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య – ఈ సమయంలో పెద్ద పేగు యాక్టివ్గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపే పనిలో అది మునిగి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా నీటిని తాగాలి.వాకింగ్; రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ;టీ వంటివి అస్సలు తాగకూడదు. ఉదయం 7 నుంచి 9 మధ్య – ప్రోటీన్లు; తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారం; ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాన్ని; పండ్లను ఈ సమయంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి.దీని వల్ల మన శరీరానికికావల్సిన పోషకాలుఎక్కువగా ఉదయమే అందుతాయి. ఉదయం 9 నుంచి 11 మధ్య – ఈ సమయంలో మన శరీరంలోనిప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మన శరరీంలో జరిగే జీవక్రియలను గాడిలోపెడుతుంది. ఉదయం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలనుశరీరం గ్రహించేలా చేస్తుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య – ఈ సమయంలో మన గుండె ఉత్తేజంగా పనిచేస్తుంది. శరీర భాగాలకురక్తం బాగా సరఫరాఅయ్యేలా చూస్తుంది. దీని వల్ల శరీర కణాలకు శక్తి అందు తుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు – ఈ సమయంలో చిన్న పేగులు అలర్ట్గా ఉండి బాగా పనిచేస్తాయి. మనం తిన్న బ్రేక్ఫాస్ట్; లంచ్ల జీర్ణప్రక్రియను ముగిస్తుంటాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు – ఈ సమయంలో మన మూత్రాశయం యాక్టివ్గా పనిచేస్తుంది. శరీరంలోనివ్యర్థాలను బయటకి పంపే పనిలోఉంటుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగాలి. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు – ఈ సమయంలోనూ మన కిడ్నీలు బాగా చురుగ్గా పనిచేస్తాయి.