హిందూ టెంపుల్స్

దేశ వాణిజ్య రాజధాని ముంబయి… ఆర్థిక నగరంగా వెలగొందడానికి అక్కడ వెలసివున్న శ్రీమహాలక్ష్మే కారణం అని చెబుతారు. అక్కడికి వెళ్లిన వారెవరైనా ఆ దేవి ఆలయాన్ని సందర్శించకుండా తిరిగిరారు. సముద్రతీరంలో మహాలక్ష్మి వెలసివున్న ఆ ప్రాంతాన్ని కూడా ‘మహాలక్ష్మి’ పేరిటనే వ్యవహరించటం విశేషం. లక్ష్మీదేవి ఆల యమైనా; అక్కడ దేవి; కుడివైపున శ్రీమహాకాళి; ఎడమవైపున శ్రీమహా సరస్వతి కనిపిస్తారు. ఆ విధంగా మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న ఆ చల్లని తల్లి కొలువైవున్న మహాలక్ష్మి ఆలయ విశేషాలు* పురాతన దేవాలయాల్లో ముంబయి లోని మహాలక్ష్మి దేవాల యం ఒకటి. ఈ దేవాలయం ముంబయి నగరంలో బ్రీ చ్ క్యాండీలోని బి.దేశా య్ రోడ్‌లో నెలకొని ఉంది. అరేబియా స ముద్రపు ఒడ్డున కొలు వైవున్న మహాలక్ష్మి మా తను సందర్శించి ఆమె దీవెనలు పొందేందుకు లక్షలమంది భక్తులు వస్తుం టారు. అష్టైశ్వర్యాలను ఒసగే మహాతల్లిగా హిందువులు మహా లక్ష్మిని కొలుస్తారు. ఈ దేవాలయాన్ని ఒకసారి పరికించి చూస్తే… ఆలయ ప్రధాన ద్వారం అద్భుతంగా తాపడం చేయబడి వుంటుంది. లక్ష్మీమాతకు పూజలు చేసేందుకు పూలు; ఇతర పూజ సామగ్రి ఆలయ ప్రాంగ ణంలోని షాపులలో లభ్యమవుతాయి.స్వర్ణాభరణాలతో సంపదల తల్లిగా గోచరించే ఇక్కడి మహాలక్ష్మి రూపు హిందూ గృహాల్లో కనబడుతుంటుంది. సిరిసంపదలనొసగే ముంబయి మహాలక్ష్మికి భక్తకోటి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. దేవాలయం చరిత్ర గురించి చూసినప్పుడు…