నీటి కథలు

ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డు పైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుఱ్ఱం మీద వెళుతు ఈ కేకలన్నీ విన్నాడు.. ” ఏమైందిరా నీకు ! ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు? అన్నాడు.” మీకెమిటి? మహారాజులు. మిమ్మల్ని భగవంతుడు ఒక రాజు గారి కుమారుడిగా పుట్టించాడు. మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా ఖర్మ ఇలా ఉంది.ఒక రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు. చూడండి. దేవుడికి ఎంత పక్షపాతమో! అన్నాడు..మహారాజు చిరునవ్వు నవ్వాడు ” అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు. చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా! “” అన్నాడు.” నిజం చెప్పారు మా రాజా ! ” అన్నాడు బిచ్చగాడు.” ఒరేయ్ ! నీకు పది వేల వరహాలు ఇస్తాను .నీ అరచేయి కోసుకుంటా .ఇస్తావా ! అన్నాడు రాజుగారు.” భలేవారే ! అర చేయి లేక పోతే ఎలా ! ” అన్నాడు బిచ్చగాడు.” సరే. నీ కుడి కాలు మోకాలి వరకు కోసుకుంటాను…ఒక లక్ష వరహాలు ఇస్తాను..ఇస్తావా! అన్నాడు.రాజుగారు.” ఎంత మాట! ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో! ఇవ్వను. అన్నాడు బిచ్చగాడు.” అన్నింటినీ కాదంటున్నావు. ఆఖరిగా అడుగుతున్నా..పది లక్ష ల వరహాలు ఇస్తాను. నీ నాలుక కోసుకుంటా ..ఇస్తావా! అన్నాడు రాజుగారు.” అమ్మో! మీరు నా జీవితాన్ని ఆడిగేస్తున్నారు. ఇవి లేకపోతే నేను ఎలా జీవించగలను? అన్నాడు బిచ్చగాడు.” ఓహో! అయితే నువ్వు పెడవాడివి కాదన్నమాట! నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచేయి; లక్ష రూపాయిల కన్నా విలువైన కాళ్ళు; పది లక్షల కన్నా విలువైన నాలుక ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయా? మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండానిందిస్తావా! ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో. అందరూ అదే చేస్తున్నారు. ఫో ఇక్కడనుండి.!అన్నాడు రాజుగారు.దేవుడు మనకి అన్ని ఇచ్చాడు. కాని మనకి ఎప్పుడూ ఎదో ఒకటి లేదని ఏడుస్తూనే ఉంటాం. పపని చేయడానికి చేతులు కాళ్ళు; అలోచించడానికి మెదడు; నీకు వచ్చిన ఆలోచనలతో ఏదైనా సృష్టించడానికి సృష్టిలో అనేక రకాల ఖనిజాలు; శిలలు; అనేక సంపదలు ఇచ్చాడు. అమ్మానాన్న నీకు ఒక వయస్సు వచ్చేవరకు తిండి బట్ట చదువు అన్ని చెప్పిస్తున్నారు. ఇలా ఎన్నో కాళ్ళ ముందు ఉన్నా! ఇంకేదో కావాలి. ఆ ఎదో కోసం ఇంకేదో చేయాలి. తండ్రుల తాతల ఆస్తులు; భార్యల కట్నాలు; లక్షల్లో జీతాలు; కోట్లల్లో వ్యాపారాలు ఇవన్ని సొంతం చేసుకోవడానికి చేయరని దారుణాలు చేస్తున్నారు. కాని మనకి అన్ని ఉన్నాయి అనే సంగతి మాత్రం గ్రహించడం లేదు. విలువైనవి ఎన్నో మన దగ్గర ఉన్నాయి. వాటి విలువ తెలుసుకోండి. అప్పుడు ఎదుటివారి విలువ తెలుస్తుంది.శ్రీశ్రీ..