ఆహారం ఆరోగ్యం అందం

 పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనరోజు. సోమ అంటే .. స+ఉమ .. ఉమతో కూడినవాడు అనే అర్థం చెప్పబడుతోంది. శివుడు శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు … పార్వతీదేవి సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ వుంటుంది. అందువలన సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.ఈ రోజున అంతా ఆ స్వామికి పూజాభిషేకాలు జరుపుతుంటారు. ఇక కొంతమంది ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని; పూజామందిరంలోనే స్వామికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక ఎవరిలోనైనా ఆ సదాశివుడికి కావలసినది అంకితభావమే. చిత్తశుద్ధితో పూజించాలేగాని ఆయన అనుగ్రహించనిది లేదు.ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన; ఆ ఇంట ఎప్పటికీ ‘లేమి’ అనే మాట వినిపించదని చెప్పబడుతోంది. అంటే ఆ స్వామి అనుగ్రహం వలన దారిద్ర్యం అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి రాదు. ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని కీర్తించారు. సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన సమస్తపాపాలు పటాపంచలై పోవడమే కాకుండా; సంపదలు … సౌఖ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు. హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను; చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం.ధారాభిషేకం: కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’.ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం.ఆవృత్త్భాషేకం: జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి. ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు.రుద్రాభిషేకం: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు ‘తేజోలింగం’. తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు.శతరుద్రాభిషేకం: చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ‘ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి. శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు.ఏకాదశ రుద్రాభిషేకం: శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు ‘వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం.